![]() |
![]() |

సోషల్ మీడియాలో పటాస్ ప్రవీణ్ ఫైమా జోడి ఒకప్పుడు కలిసి వీడియోస్ చేసేవాళ్ళు. ఐతే వీళ్ళిద్దరూ తర్వాత విడిపోయారు. ప్రవీణ్ ఐతే నిజంగా లవ్ చేశాను ఫైమాని అని చెప్తే ఫైమా మాత్రం జస్ట్ ఫ్రెండ్ అనేసరికి ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు తన మరదలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఐతే తన మరదలుకి తానేంటో ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఐతే ఈ విషయాన్ని ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బయటపెట్టాడు. అలాగే ప్రవీణ్ తన మరదలిని కూడా ఈ షోకి తీసుకొచ్చాడు.
ఐతే రాంప్రసాద్ వచ్చి "ఏంటి ప్రవీణ్ సెటిల్ అయ్యావంట.. కొత్త అమ్మాయిని చూసుకున్నావట..పెళ్లి చేసుకోబోతున్నావట" అని అడిగాడు. దానికి ఇంద్రజ అది తన డెసిషన్ అని చెప్పారు. "ప్రవీణ్ నన్ను తల్లిగా స్థానంలో ఉంచి ఎక్కువగా అభిమానిస్తాడు..అలా తన సమస్యను చెప్పుకున్నాడు. ఐతే నేను కూడా ప్రవీణ్ నిజమైన ప్రేమకు ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే బాగుండు అనుకున్నా. ఆ అమ్మాయికి కూడా ప్రవీణ్ అంటే ఇష్టం..అందుకే వాళ్లకు ఈ షోకి నేను ఇన్వైట్ చేసాను" అన్నారు. ఇక రష్మీ "ఏంటి ఇది రియలా ? అని అడిగింది. " అవును ..వంశికకి ఫాదర్ లేడు..ఫామిలీని ఈ అమ్మాయే పోషిస్తుంది. అందుకే వంశిక అంటే ఇష్టం" అన్నాడు ప్రవీణ్. "ప్రవీణ్ అందరినీ బాగా చూసుకుంటాడు...చాలా ప్రేమగా ఉంటాడు..అందుకే ఇష్టం" అని చెప్పింది వంశిక.
![]() |
![]() |